ఆర్టీసీ సమ్మెలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన - tsrtc strike continues in zaheerabad
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేసి తమ సమస్యలను కొనసాగించాలని నినాదాలు చేశారు.
ఆర్టీసీ సమ్మెలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు చేస్తున్న సమ్మె ఆరో రోజుకు చేరింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు చేపడుతున్న సమ్మెకు పీఆర్టీయూ, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. బస్టాండ్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు.