తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేస్తున్న సమ్మె ఆరవ రోజుకు చేరింది.

ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

By

Published : Oct 10, 2019, 1:18 PM IST

ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెపై తమ వైఖరి మార్చుకోకపోతే.. మరో సకల జనుల సమ్మె తప్పదని జేఏసీ మెదక్ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ఆర్టీసీ కార్మికులతో కలిసి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని.. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అనంతరం భాజపా జిల్లా నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టేదిలేదని.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. తగిన మూల్యం చెల్లించక తప్పదని వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

ABOUT THE AUTHOR

...view details