సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో అధికారులు బస్సు సేవలను ప్రారంభించారు. డిపోలోని ఐదు బస్సుల్లో పోలీస్ సిబ్బందిని వెంట పంపుతూ హైదరాబాద్కు పంపించారు. కార్మిక ఐకాస నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా పోలీసులు జోక్యం చేసుకుని వారించడంతో జహీరాబాద్ నుంచి రాకపోకలు ప్రారంభించారు. తాత్కాలిక విధులు నిర్వహించేందుకు డ్రైవర్లు, కండక్టర్లు ముందుకు వస్తే మరిన్ని బస్సులను నడిపేందుకు ప్రయత్నిస్తామని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.
తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో రోడెక్కుతున్న బస్సులు - tsrtc bus strike today
పోలీసుల బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులు రోడెక్కుతున్నాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో అధికారుల బస్సులను నడిపిస్తున్నారు.
తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో రోడెక్కుతున్న బస్సులు