సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపో ఎదుట కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. బస్టాండ్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం నిర్మించారు. ప్రభుత్వం కార్మికుల ఐక్యతను దెబ్బతీసేందుకు సీఎం కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు.
'డిమాండ్లు పరిష్కరించేవరకు విధుల్లో చేరబోం'
ఆర్టీసీ కార్మికుల సమ్మె 32వ రోజు కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపో ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఏ ఒక్కరూ వీధుల్లో చేరబోమని ప్రతిజ్ఞ చేశారు.
TSRTC EMPLOYEES STRIKE AT JAHEERABAD DEPOT ON 32 DAY
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఏ ఒక్కరూ వీధుల్లో చేరబోరని ప్రతిజ్ఞ చేశారు. కార్మికుల సమ్మెకు సంఘీభావంగా ఐకాసలోని సభ్యులు రోజుకొకరు చొప్పున అన్నదాన కార్యక్రమం నిర్వహించి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?