ఆర్టీసీ జేఏసీ బంద్ పిలుపుమేరకు హైదరాబాద్ బీహెచ్ఈఎల్ డిపోకే బస్సులు పరిమితమయ్యాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీహెచ్ఈఎల్ డిపోలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. అక్కడకు చేరుకున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను చూసిన ఆర్టీసీ కార్మికులు బస్సులను బయటకు తీయవద్దంటూ డిపో మేనేజర్‌ను అభ్యర్థించారు.
బస్సులను అడ్డుకున్న కార్మికులు.. అరెస్ట్ - tsrtc employees strike 15th day latest
ఆర్టీసీ ఐకాస పిలుపుమేరకు సాగుతున్న బంద్ నేపథ్యంలో బీహెచ్ఈఎల్ డిపో నుంచి బస్సులు తీసేందుకు అధికారులు యత్నించగా.. కార్మికులు, వామపక్షాల నేతలు వాటిని అడ్డుకున్నారు.
డిపో నుంచి వస్తున్న బస్సులను అడ్డుకుంటున్న కార్మికులు
డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన భాజపా, కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బస్సులను అడ్డుకున్న వారిని, విధ్వంసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. డిపో ముందున్న నాయకులను, ఆర్టీసీ కార్మికులను చందానగర్ పీఎస్‌కు తరలించారు.
ఇదీ చదవండిః రాణిగంజ్‌లో వంది మంది కార్మికుల అరెస్ట్