సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కొత్తూరు(డి) వద్ద ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.... హైదరాబాద్ నుంచి జహీరాబాద్ మీదుగా బీదర్ వెళ్తుంది. కొత్తూరు(డి) కూడలిలో యూటర్న్ తీసుకుంటున్న లారీని వెనుక నుంచి వస్తున్న బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో 12 మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. బస్సు వేగంగా లేకపోవటం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. క్షతగాత్రులను జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం - LATEST RTC BUS ACCIDENTS AT SANGAREDDY
సంగారెడ్డి జిల్లా కొత్తూరు(డి) వద్ద ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న లారీని వెనక నుంచి వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోగా... ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
TSRTC BUS ACCIDENT AT SANGAREDDY KOTTHURU