గ్రేటర్ ఎన్నికల్లో వందకు పైగా సీట్లును తెరాస కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భాజపా, కాంగ్రెస్‌లకు ఓట్లు అడిగే హక్కు లేదని ఆయన విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అభ్యర్థి మెట్టుకుమార్ యాదవ్ సంఘీభావ సభలో ఆయన ప్రసంగించారు.
గ్రేటర్లో వందకుపైగా సీట్లు సాధిస్తాం: మహిపాల్‌రెడ్డి - సంగారెడ్డి జిల్లా తాజా సమాచారం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు మాకే ఉందని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. తెరాస అభ్యర్థి మెట్టుకుమార్ యాదవ్ సంఘీభావ సభలో ఆయన మాట్లాడారు. గ్రేటర్లో వందకు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
గ్రేటర్లో వందకుపైగా సీట్లు సాధిస్తాం: మహిపాల్‌రెడ్డి
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులే తెరాసను గెలిపిస్తాయని ఆయన అన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా భాజపా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసి పటాన్చెరు డివిజన్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.