70 ఏళ్లుగా పాలించిన పార్టీలే ఒకరినొకరు తిట్టుకుంటున్నారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అందరికీ విద్య, వైద్యం, ఇల్లు అనే ప్రాథమిక అవసరాలు తీరలేదని దుయ్యబట్టారు. తెరాస ఎవరికీ బీ టీమ్ కాదని.. తమకు తామే బాసులమని ఘాటుగా స్పందించారు. దేశ గతిని మార్చే అజెండాను తెరాస రూపొందిస్తుందని తెలిపారు. ఆదర్శమైన పథకాలు దేశం మొత్తం అమలు కావాలని సీఎం ఆకాంక్షించారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే దేశ రాజకీయాల్లో గులాబీ పార్టీ కీలక శక్తిగా ఉంటుందని సంగారెడ్డి జిల్లా అల్లదుర్గం తెరాస సభలో అభిప్రాయపడ్డారు.
'దేశ గతిని మార్చే అజెండా రూపొందిస్తున్నాం' - CONGRESS
దేశ గతిని మార్చే దిశగా తెరాస కృషి చేస్తుందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఆదర్శమైన పథకాలు దేశం మొత్తం అమలు కావాలని అల్లదుర్గం సభలో పేర్కొన్నారు. 70 ఏళ్లుగా పాలించిన పార్టీలు ఏం చేశాయని ప్రశ్నించారు.
కేసీఆర్