ఏది మంచో.. ఏది చెడో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని సంగారెడ్డి జిల్లా అల్లదుర్గం తెరాస సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. ఐదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందో గమనించాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుంటే రైతుబంధు, రైతు బీమా పథకాలు సాధ్యమయ్యేవి కావని పేర్కొన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండానే బాధిత రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఇస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ద్వారా లక్ష ఎకరాలకు నీరిచ్చే బాధ్యత తనదని కేసీఆర్ హామీ ఇచ్చారు.
కాళేశ్వరం ద్వారా లక్ష ఎకరాలకు నీరు - SINGURU
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నీరందించే బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్ అల్లదుర్గం సభలో హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని గులాబీ బాస్ స్పష్టం చేశారు.
![కాళేశ్వరం ద్వారా లక్ష ఎకరాలకు నీరు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2892583-377-ccac0eba-24d4-4deb-bda4-e5c7b02452c3.jpg)
కేసీఆర్