తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇచ్చిన హామీలను నెరవేరుస్తా: భారతీనగర్​ తెరాస అభ్యర్థి - జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాల అప్​డేట్స్​

గ్రేటర్​ బరిలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా భారతీ నగర్​ డివిజన్​లో తెరాస అభ్యర్థి సింధు ఆదర్శ్​ రెడ్డి విజయం సాధించారు. ఈ మేరకు డివిజన్​ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు సింధు హామీ ఇచ్చారు.

trs candidate won in bharathi nagar division
ఇచ్చిన హామీలను నెరవేరుస్తా: భారతీనగర్​ తెరాస అభ్యర్థి

By

Published : Dec 4, 2020, 5:07 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా భారతీనగర్​ డివిజన్​లో తెరాస అభ్యర్థి విజయం సాధించారు. భాజపా అభ్యర్థి గోదావరి అంజిరెడ్డిపై సింధు ఆదర్శ్​ రెడ్డి 4,688 ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను ఈ ఐదేళ్లలో నెరవేరుస్తానని ప్రజలకు సింధు హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాల పట్టాలు, రెండు పడక గదుల ఇళ్లు, పింఛన్లు హామీ ఇచ్చానని వాటిని 100 శాతం అమలయ్యేలా చూస్తానని చెప్పారు. సెట్టింగ్ కార్పొరేటర్​గా చేసిన అనుభవంతో ఈసారి మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.

భారతీనగర్​ డివిజన్​లో తెరాస అభ్యర్థి ఘన విజయం

ఇదీ చదవండి:దత్తాత్రేయ నగర్​ డివిజన్​లో ఎంఐఎమ్​ విజయం

ABOUT THE AUTHOR

...view details