సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, రవాణాశాఖ సంయుక్తంగా వాహనాల పంపిణీ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా నిమజ్జన రోజుల్లో మధ్యాహ్న సమయంలో రద్దీ ఉండటం వల్ల వాహనాల కిరాయిని యాజమాన్యాలు యథేచ్చగా పెంచుతున్నారు. విపరీతమైన రేట్ల వల్ల మండపాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులను అధికమించేందుకు శిబిరం ద్వారా వాహనాలను అందిస్తున్నారు అధికారులు. చార్మినార్, అత్తాపూర్, రాజేంద్రనగర్లాంటి పలు ప్రాంతాల నుంచి కూడా వాహనాల కోసం వస్తున్నారని చెబుతున్న ఎంవీఐ రజా మహమ్మద్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రాజు ముఖాముఖి...
రవాణాశాఖ నిర్ణయించిన ధరకే నిమజ్జన వాహనాలు...! - భాగ్యనగర్ ఉత్సవ కమిటీ
గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చే భారీ వాహనాల విషయంలో రవాణాశాఖ ఓ ముందడుగేసింది. భాగ్యనగర ఉత్సవ కమిటీతో కలిసి వాహనాల పంపిణీ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అధికారులు నిర్ణయించిన రేట్లకే మండప నిర్వాహకలకు టేలర్లను అందిస్తున్నారు.
Transport vehicles for a fixed price ...