సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లకు రాష్ట్ర ప్రత్యేక పోలీసు దళం కమాండెంట్ అన్వర్ బాషా నియామక పత్రాలు అందించారు. దేశ రక్షణలో కానిస్టేబుళ్ల పాత్ర కీలకమని ఆయన అన్నారు. ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని.. దీనికి ఎస్పీఎఫ్ మారుపేరు అని ఆయన తెలిపారు.
కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తి.. నియామక పత్రాలు అందజేత - Telangana police
దేశ రక్షణలో కానిస్టేబుల్ పాత్ర అత్యంత కీలకమైనదని.. రాష్ట్ర ప్రత్యేక పోలీసు దళం కమాండెంట్ అన్వర్ బాషా అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లకు ఆయన నియామక పత్రాలు అందించారు.
కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తి.. నియమాక పత్రాలు అందించిన కమాండెంట్
కఠోర శిక్షణ పూర్తి చేసుకొని.. విధుల్లో చేరబోతున్న కానిస్టేబుళ్లంతా.. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో ధైర్యంగా, నిజాయితీగా వ్యవహరించాలని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారి చేత.. అకాడమీ ప్రిన్సిపల్.. అడిషనల్ కమాండెంట్ దేవిదాసు ప్రతిజ్ఞ చేయించారు.
ఇదీ చూడండి:ఎయిమ్స్‌ను మరింతగా తీర్చిదిద్దుతాం: కిషన్ రెడ్డి