కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ ఇంఛార్జీ గాలి అనిల్ కుమార్ సౌజన్యంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీహెచ్ఈల్ వెంకటేశ్వర ఆలయంలో అర్చకులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలుస్తున్న గాలి అనిల్ కుమార్‌ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని జెట్టి కుసుమ కుమార్ అన్నారు.
నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత - నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత
లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పురోహితులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ నిత్యావసర సరుకులు అందజేశారు.

నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత
దేవుడి దయ వల్ల కరోనా మహమ్మారి పీడ తొందరగా విరుగుడు కావాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులు నిత్యావసర సరుకులు అందజేయాలని తెలిపారు.
ఇవీ చూడండి: హైదరాబాద్‌లోనూ ఆయువు తీసే వాయువులెన్నో?