తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుద్యోగ భృతి సాధించేవరకు.. పోరాడాలి: ఉత్తమ్​ - తెలంగాణ ఉద్యమం

రాష్ట్రంలో నిరుద్యోగ రేటు రోజురోజుకు పెరిగిపోతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో జరిగిన యూత్ కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు.

TPCC president Uttam said the unemployment rate in the state was rising day by day
'నిరుద్యోగ భృతి సాధించేవరకు.. పోరాడాలి'

By

Published : Feb 24, 2021, 4:22 AM IST

Updated : Feb 24, 2021, 8:01 AM IST

రాష్ట్రంలో నిరుద్యోగ భృతి సాధించేవరకు.. తెలంగాణ ఉద్యమం తరహాలోనే పోరాటం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఐనోలులో జరిగిన యూత్ కాంగ్రెస్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. నిరుద్యోగులను ఆదుకోవడంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్​, మధుయాస్కీ, కొండా విశ్వేశ్వర్​, ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజక వర్గాల అభ్యర్థి చిన్నారెడ్డి, రాములునాయక్​ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:భాజపా సునామీలో తెరాస గల్లంతు ఖాయం: తరుణ్​చుగ్

Last Updated : Feb 24, 2021, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details