సంగారెడ్డిలో టీఎంయూ నాయకులు రిలే నిరాహాదీక్షలు చేపట్టారు. కమిటీ పిలుపు మేరకు మెదక్ రీజియన్లోని 8 డిపోల వద్ద రెండు రోజులపాటు రిలే దీక్షలు చేపడుతున్నట్లు రీజియన్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ఉద్యోగులకు వేతన సవరణ, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల కొరతతో ఉద్యోగులపై పని భారం పెరిగిపోతోందన్నారు. వెంటనే కొత్తవారిని తీసుకోవాలని కోరారు.
సమస్యల పరిష్కారానికి టీఎంయూ దీక్షలు - rtc
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీఎంయూ రెండు రోజుల పాటు రిలే నిరాహారదీక్షలు చేపట్టింది. సంగారెడ్డిలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

దీక్షలో కార్మిక నాయకులు
సమస్యల పరిష్కారానికి టీఎంయూ దీక్షలు
ఇదీ చదవండిః కారు ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి