తెలంగాణ

telangana

ETV Bharat / state

హుండీ దొంగల అరెస్ట్​.. ఆటో స్వాధీనం - హుండీ దొంగల అరెస్ట్​.

హుండీలు పగులకొట్టి చోరీ చేస్తున్న ఇద్దరు సభ్యుల దొంగల ముఠాను సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.8 వేల నగదు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.

హుండీ దొంగల అరెస్ట్​

By

Published : Oct 13, 2019, 9:19 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారంకు చెందిన గంగారం సంజీవులు, పెద్దింటి ఆంజనేయులు కలిసి రాత్రి సమయంలో ఆటో నడుపుకునేందుకు అద్దెకు తీసుకునేవారు. ఆటో తీసుకుని వెళ్లి.. దేవాలయాల్లోని హుండీలు పగలగొట్టి అందులోని నగదు ఎత్తుకెళ్లేవారు. ఇలా పటాన్​చెరు, కేపీహెచ్​బీ, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవాలయాల్లో దొంగతనాలు చేశారు. ఈ నెల 12న పటాన్​చెరు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న సంజీవులు, ఆంజనేయులును అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో నేరం ఒప్పుకోవడం వల్ల నిందితులను రిమాండ్​కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ.8 వేల నగదు, ఒక ఆటో, చోరీకి ఉపయోగించే ఇనప రాడ్​ను స్వాధీనం చేసుకున్నారు.

హుండీ దొంగల అరెస్ట్​.. ఆటో స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details