సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో చున్నీలాల్ అనే వ్యక్తి శ్రీగణేష్ బంగారం దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. గురువారం మార్కెట్కు సెలవు కావడంతో దుకాణంను తెరవలేదు. అయితే వెనుకవైపున తలుపులు తెరిచి ఉండటం వల్ల స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే యజమానికి సమాచారం అందజేశారు. అతను దుకాణం తెరిచి చూసేసరికి వెనుక గోడకు కన్నం ఉంది. షాపులో దాదాపు 15 లక్షలు విలువ చేసే ఆభరణాలు మాయం అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎన్నికల వేళ... దొంగల హస్తలాఘవం - ఎన్నికల వేళ... దొంగల హస్తలాఘవం
అందరూ ఎన్నికల ఒత్తిడిలో ఉంటే దొంగలు వారి హస్తలాఘవం ప్రదర్శించి పెద్ద ఎత్తున వెండిని దోచుకుపోయారు. పటాన్చెరులోని ఇస్నాపూర్లో దుకాణం గోడకు కన్నం కొట్టి 15 లక్షల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
పటాన్చెరులో దొంగల చోరీ