సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ఓ ఇంట్లో... ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టిన దుండగులు పెద్ద ఎత్తున నగదు దోచుకెళ్లారు. ఎల్ఐజీ క్వార్టర్ నెంబర్ 162లో సత్యనారాయణ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో ఏపీలోని తన స్వగ్రామమైన రాజోలుకు కుటుంబంతో కలిసి వెళ్లాడు.
ఊరెళ్లి వచ్చేసరికే.. లక్షలు దోచేశారు - లాక్డౌన్ సమయంలో భారీగా నగదు చోరీ
లాక్డౌన్ కారణంగా స్వగ్రామానికి వెళ్లిన వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీ చేశారు. రూ. 6.8లక్షల నగదును దొంగిలించి వెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో చోటు చేసుకుంది.
![ఊరెళ్లి వచ్చేసరికే.. లక్షలు దోచేశారు theft-huge-money-in-a-home-in-lock-down-time-at-sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7378073-thumbnail-3x2-chori.jpg)
అర్ధరాత్రి చోరి... రూ.6.8లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
అర్ధరాత్రి చోరి... రూ.6.8లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
ఇదే అదనుగా భావించిన దుండగలు అర్థరాత్రి సమయంలో నెంబర్లేని ద్విచక్రవాహనంపై వచ్చి ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని 6.8లక్షల నగదును దొంగలించారు. బంగారం కూడా పోయింది అనుకున్నప్పటికీ.. వెతకగా దొరికిందని పోలీసులు తెలిపారు. దొంగలు బైక్పై వచ్చి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలలో నిక్షిప్తమయ్యాయి.
ఇవీ చూడండి:'బోరు'న పొంగిన దుఃఖం.. బాలుడి కథ విషాదాంతం