Shiva Temple Demolished in Sangareddy: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ శ్రీవాణి నగర్‌లో ఉన్న శివాలయాన్ని... తమకు కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చిందంటూ రాత్రికి రాత్రే కూల్చివేశారు. 165 సర్వే నెంబర్‌లో ఉన్న ఈ దేవాలయానికి సంబంధించిన భూ వివాదం మీద బాచుపల్లికి చెందిన పాండురంగారెడ్డికి గతంలో కోర్టులో కేసు నడిచింది. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిందంటూ.... ఆయనే ఈ శివాలయాన్ని కూల్చివేశాడని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.
కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చిందంటూ శివాలయం కూల్చివేత - సంగారెడ్డి జిల్లాలో శివాలయం కూల్చివేత
Shiva Temple Demolished in Sangareddy: కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందంటూ శివాలయాన్నిరాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చోటుచేసుకుంది. ఎలాంటి అల్లర్లు జరగకుండా డీఎస్పీ పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Shiva Temple Demolished
రేకులతో నిర్మించిన ఈ ఆలయం రేకులన్నీ తొలగించడంతో... స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఎలాంటి అల్లర్లు జరగకుండా డీఎస్పీ పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవాలయాన్ని మళ్లీ రేకులతో పునరుద్ధరించుకుంటామని శ్రీవాణి నగర్ కాలనీ వాసులు అంటున్నారు.
ఇదీ చదవండి:కొండగట్టు అంజన్న జయంత్యుత్సవాలు ప్రారంభం.. ఆర్జిత సేవలు రద్దు