తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల ఆరోగ్యం కోసమే.. పట్టణ ప్రగతి కార్యక్రమం - ఎమ్మెల్సీ మహ్మద్‌ ఫరీదుద్దీన్‌

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. స్థానిక ఆదర్శనగర్, దత్తగిరి కాలనీ, శ్రీరామ్ వీధిలో ఎమ్మెల్సీ మహ్మద్‌ ఫరీదుద్దీన్‌ పర్యటించారు. పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే.. తెరాస ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

The second phase of the city of Zahirabad is urban development
ప్రజల ఆరోగ్యం కోసమే.. పట్టణ ప్రగతి కార్యక్రమం

By

Published : Jun 4, 2020, 5:44 PM IST

పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే.. తెరాస ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఎమ్మెల్సీ మహ్మద్‌ ఫరీదుద్దీన్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. స్థానిక ఆదర్శనగర్, దత్తగిరి కాలనీ, శ్రీరామ్ వీధిలో పర్యటించారు.

సమస్యలు పరిష్కరించండి

ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ, మురుగు కాలువల శుభ్రత, తాగునీటి సరఫరా అంశాలపై ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని.. కొత్తవాటి నిర్మాణానికి కృషి చేయాలని స్థానికులు ఎమ్మెల్సీకి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:భాగ్యనగరంలో మోగుతున్న కరోనా ఘంటిక

ABOUT THE AUTHOR

...view details