జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక వివాదంపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మదన్ మోహన్ రావు వేసిన పిటిషన్పై విచారణ ముగిసింది. ఝార్ఖండ్లో ఓ కేసులో శిక్ష పడిన విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించలేదని, కేసులను విస్తృతంగా ప్రచారం చేయాలన్న నిబంధననూ పాటించలేదని మదన్ మోహన్రావు వాదన. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందున బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని మదన్ మోహన్ రావు హైకోర్టును కోరారు.
ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక వివాదం.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు - telangana latest news
బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మదన్ మోహన్ రావు వేసిన పిటిషన్పై విచారణ ముగిసింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్ చేశారు.
హైకోర్టు
ఝార్ఖండ్లో వేతనాలకు సంబంధించి కేసులో జరిమానా పడిందని.. అది ఈసీ నిబంధనల పరిధిలోకి రాదని బీబీ పాటిల్ తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వు చేశారు.
ఇవీ చదవండి: