తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆన్నదాత ఆగమాగం.. మార్కెట్​లో దయనీయంగా ధాన్యం! - The grain was drenched in the buying centers at sangareddy district

ధాన్యం మార్కెట్​కు తరలించి పదిరోజులైనా పట్టించుకునే నాథుడే లేడు. ఆరుగాలం కష్టించి.. పంటలు పండించి.. తీరా అమ్మడానికి కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే కనీస సౌకర్యాలు లేక రైతులు నానా తంటాలు పడుతున్నారు. వర్షం వస్తే ఇక అంతే సంగతులు. ధాన్యం నీళ్లపాలే!

'ధాన్యం తడుస్తోందా? ఎమ్మెల్యే ప్రారంభించాకే కొంటాం'

By

Published : Nov 8, 2019, 4:38 PM IST

'ధాన్యం తడుస్తోందా? ఎమ్మెల్యే ప్రారంభించాకే కొంటాం'

సంగారెడ్డి జిల్లాలో రాత్రి కురిసిన వర్షం అన్నదాతలను మరోసారి ఇబ్బందులకు గురిచేసింది. హత్నూర, దౌల్తాబాద్, బోర్పట్లలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.

తెచ్చిన ధాన్యం తడవకుండా ఉంచటానికి టర్పైన్​ కవర్లు సైతం అందుబాటులో ఉండటం లేదు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా అన్నదాతలు వేడుకుంటున్నారు.

సకాలంలో సంచులు ఇవ్వకపోవడం వల్లనే.. బస్తాల్లో ధాన్యం నింపలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రారంభించిన తర్వాతే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పారని వాపోయారు. చేతికి వచ్చిన ధాన్యం తడవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని అన్నదాతలు కన్నీరు మున్నీరయ్యారు.

ఇదీ చూడండి : తల్లి,తమ్ముడి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details