పేదల ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన రూ.1500 నగదును ఇప్పటివరకు తీసుకోని వారు తమ సమీపంలోని పోస్టాఫీసు నుంచి తీసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. అలాగే ఇప్పటి వరకు నగదు జమకాని వారికి పోస్టాఫీసు ద్వారా నేరుగా కార్డుదారులకు నగదు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
రూ.1500 పోస్టాఫీసులో తీసుకోవచ్చు: కలెక్టర్ - పోస్టాఫీస్‌ల నుంచి కూడా రూ.1500 తీసుకోవచ్చు
లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి జమ చేసిన రూ.1500లను తమ సమీపంలోని పోస్టాఫీసులో తీసుకునే వెసులుబాటును కల్పించిందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ప్రజలకు తెలిపారు.

పోస్టాఫీస్‌ల నుంచి కూడా రూ.1500 తీసుకోవచ్చు
బ్యాంకుల నుంచి నగదు తీసుకోని వారు తమ ఆధార్ కార్డుతో దగ్గరలోని పోస్టాఫీసుకి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా 1500 రూపాయలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
Last Updated : Apr 19, 2020, 7:16 PM IST
TAGGED:
రూ.1500 నగదు