సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రిలో కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియను స్థానిక ఎమ్మెల్యే మానిక్ రావు ప్రారంభించారు. కొవిడ్ ఐసోలేషన్ వార్డులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఆయన వ్యాక్సిన్‌ను వైద్యులకు అందజేశారు.
జహీరాబాద్‌లో పారిశుద్ధ్య కార్మికురాలికి తొలి కొవిడ్ టీకా
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే మానిక్ రావు వ్యాక్సినేషన్‌ను ప్రక్రియను ప్రారంభించారు. తొలి టీకాను ఆసుపత్రిలోని పారిశుద్ధ్య కార్మికురాలికి ఇచ్చారు.
సంగారెడ్డిలో పారిశుద్ధ్య కార్మికురాలికి తొలి కొవిడ్ టీకా
తొలి కరోనా వ్యాక్సిన్ డోసును ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలు ఎలిజిబెత్‌కు ఇచ్చారు. అనంతరం వ్యాక్సిన్‌ను ఆసుపత్రి సీనియర్ వైద్యుడు డాక్టర్ సునీల్ తీసుకున్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం టీకా తీసుకున్న వారందరికీ విశ్రాంతి అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి:నకిలీ విలేకరులను అరెస్ట్ చేసిన పోలీసులు