ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగిస్తూ సమాజాన్ని కేంద్ర ప్రభుత్వం పీల్చిపిప్పి చేస్తోందని తెలంగాణ డెమోక్రటిక్ ఫోరమ్ నేతలు విమర్శించారు. పేదవారి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న హామీ మరిచిందని ఆరోపించారు. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలిస్తామని మాట తప్పిందని మండిపడ్డారు.
'సమాజాన్ని కేంద్రం పీల్చి పిప్పి చేస్తోంది' - Sangareddy District Latest News
తెలంగాణ డెమోక్రటిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కేంద్రంలో జిల్లా సదస్సు నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేయకుంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ డెమోక్రటిక్ ఫోరమ్ సదస్సు
రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి కేంద్రంలోని కొత్త బస్టాండు ఆవరణలో జిల్లా సదస్సు నిర్వహించారు. భాజపా అధికారంలోకి వచ్చినా హామీలు నెరవేర్చలేదన్నారు. చట్టాలు రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: మంత్రి ఎర్రబెల్లి