అకాలవర్షం కారణంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన పంట నేలపాలు అయ్యింది. మెదక్ జిల్లా నర్సాపూర్, చిలప్‌చెడ్, సంగరెడ్డి జిల్లా హత్నూర్ మండలాల్లో ముందుగా సాగు చేసిన వరిపంట నేలవాలింది. త్వరలో పంట నూర్పిడి చేయడానికి సిద్దం అవుతున్న తరుణంలో వర్షం వచ్చి పంటలను నీటముంచిందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అకాల వర్షానికి అన్నదాతలకు తీవ్ర నష్టం - సంగారెడ్డిలో భారీ వర్షం
అకాల వర్షం కారణంగా చేతికందిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని రైతులన్నలు గుండెలు బాధుకుంటున్నారు. పలు చోట్లు విద్యుత్‌వైర్లు పొలాల్లో తెగిపడ్డాయి.
అకాలవర్షం పంటనష్టం.. రైతన్నల ఆవేదన
మరికొన్ని చోట్ల బోరుబావులు మోటారులకు సరఫరా చేసే విద్యుత్తు తీగలు తెగిపోయాయి. దానికితోడు పొలాల్లో నిలిచి ఉన్న వరదనీరు దృష్ట్యా చేనుకు వెళ్లాలన్నా రైతులు బయపడుతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని.. పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:దిగ్బంధంలో హైదరాబాద్.. నిలిచిన రాకపోకలు..