తెలంగాణ

telangana

ETV Bharat / state

రాహుల్​ సభ ఏర్పాట్లను పరిశీలించిన భట్టి - batti

ఏప్రిల్​ 1న జహీరాబాద్​లో జరిగే రాహుల్​ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి గీతా రెడ్డి సభాస్థలిని పరిశీలించారు.

పరిశీలిస్తున్న భట్టి, గీతా రెడ్డి

By

Published : Mar 28, 2019, 6:25 PM IST

Updated : Mar 28, 2019, 7:49 PM IST

రాహుల్​ సభ ఏర్పాట్లను పరిశీలించిన భట్టి
తెలంగాణలో వీలైనన్ని లోక్​సభ స్థానాలు గెలవాలని కాంగ్రెస్​ కసరత్తు చేస్తోంది. పార్టీ అగ్రనాయకులతో ప్రచారానికిఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏప్రిల్​ 1న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో రాహుల్​ గాంధీ బహిరంగ సభ జరగనుంది. సభ ఏర్పాట్లను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి గీతా రెడ్డి పరిశీలించారు.

సమయం ఆసన్నమైంది..

రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలిస్తే దేశాన్ని ఏ రకంగా ఏలుతారో కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తెరాస ప్రభుత్వానికి ఓటర్లు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రాహుల్ సభను జయప్రదం చేసేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులను కోరారు. భద్రత ఏర్పాట్లపై పోలీసు అధికారులతో భట్టి, గీతారెడ్డి చర్చించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:సీ-విజిల్ మానిటరింగ్ కేంద్రం పరిశీలన

Last Updated : Mar 28, 2019, 7:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details