సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో ఉన్న సుప్రసిద్ధ గణేష్ దేవాలయాన్ని.. ఆదివారం ఏర్పడనున్న సూర్యగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటలకు దేవాలయాన్ని మూసివేశామని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం దేవాలయం తెరవమని మళ్లీ సోమవారమే సంప్రోక్షణ చేశాక భక్తులు దర్శనానికి అనుమతిస్తామని కమిటీ నిర్వాహకులు తెలిపారు.
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి బీరంగూడ గుట్టపై ఉన్న శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయాన్ని ఆదివారం ఉదయం తెరవబోమని.. గ్రహణం ముగిశాక సాయంత్రం ఐదు గంటలకు దేవాలయంలో సంప్రోక్షణ నిర్వహించి తెరుస్తామని దేవాలయ ఈవో వేణుగోపాల్ తెలిపారు.