Covid cases in muthangi gurukul:సంగారెడ్డి జిల్లా ముత్తంగిలోని జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. ఈ రోజు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో తాజాగా 18 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. దీంతో గురుకులంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 72కు చేరింది.
Covid cases in gurukul: కొవిడ్ కలకలం.. గురుకుల పాఠశాలలో 72కు చేరిన కేసులు - corona cases in muthangi gurukul
![Covid cases in gurukul: కొవిడ్ కలకలం.. గురుకుల పాఠశాలలో 72కు చేరిన కేసులు covid cases in gurukaula](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13816188-879-13816188-1638615055075.jpg)
16:12 December 04
జ్యోతిబాపూలే గురుకులంలో కరోనా కలకలం
గత ఆరు రోజులుగా క్రితం ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఆదివారం (నవంబర్ 28) 42 మంది విద్యార్థినులు, ఉపాధ్యాయురాలికి వైరస్ నిర్ధరణ అయింది. అప్రమత్తమైన అధికారులు సోమవారం (నవంబర్ 29) మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 48కి చేరింది. వీరిలో 47 మంది విద్యార్థినులు ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు.
Corona Cases in TS: రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు.. మరో వేవ్ తప్పదా?!
Corona cases in gurukul schools: నిన్న జగిత్యాల జిల్లా మల్యాల తాటిపెల్లి గురుకుల పాఠశాలలోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం నిర్వహించిన పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులకు కరోనా నిర్ధరణ కావటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గురుకుల పాఠశాలలో మొత్తం 586 మంది విద్యార్థులున్నారు. స్వల్ప అస్వస్థతకు గురైన 200 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. వాళ్లలో ఏడుగురికి పాజిటివ్‌గా తేలగా చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నావారిని పాఠశాల సిబ్బంది ఇంటికి పంపించారు.
ఇదీ చదవండి:ఒమిక్రాన్ గుబులు.. పెరుగుతున్న కరోనా కేసులు!