ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని శాఖలకు సమాన ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జైళ్ల శాఖలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశంలో మరెక్కడా లేవని కొనియాడారు.
దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ - petrol bunk inaugrated by home minister in sangareddy
నేరాల నియంత్రణ, భద్రతలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు.
సంగారెడ్డిలో హోంమంత్రి మహమూద్ అలీ పర్యటన
జైళ్లలో తయారు చేసే ఉత్పత్తులకు క్రమంగా డిమాండ్ పెరుగుతోందని హోంమంత్రి తెలిపారు. నాణ్యత బాగుందని అందరూ మెచ్చుకుంటే.. చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 బంకుల్లో 300 మంది ఉపాధి పొందుతున్నట్లు స్పష్టం చేశారు. 2013-14లో జైళ్ల శాఖ ఆదాయం 5 కోట్లు ఉంటే.. ఇప్పుడు 20 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : మళ్లీ ఉల్లి ధరల ఘాటు.. కొండెక్కిన టమాటా
TAGGED:
telangana police System