తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా పటాన్చెరు గ్రేటర్ సర్కిల్ కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని తహసీల్దార్, డీఎస్పీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా రాష్ట్ర అవతరణ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.
పటాన్చెరులో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పటాన్‌చెరులోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
![పటాన్చెరులో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు telangana state formation day celebrations at patancheru in sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7443094-179-7443094-1591086338590.jpg)
పటాన్చెరులో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కరోనా ధాటిని ఎదుర్కొనేందుకు ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించారు. దీని కోసం అందరూ కలిసికట్టుగా శ్రమించాల్సిన అవసరముందన్నారు. అందరూ భౌతిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రతచతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్