తెలంగాణ

telangana

ETV Bharat / state

చైనా మాంజా.. పక్షుల పాలిట పంజా..! - china manja is banned

గాలిపటాలు ఎగురవేసేందుకు వినియోగిస్తున్న చైనా మాంజాలతో పక్షులతో పాటు పలుమార్లు మనుషులూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా వీటి వినియోగాన్ని కట్టడి చేయలేకపోతున్న అధికారులు ఈ సంక్రాంతి సందర్భంగా అప్రమత్తమయ్యారు. ఓ వైపు మాంజాల అమ్మకాన్ని అరికడుతూ.. మరోవైపు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

telangana police department awareness on china manja usage to prevent deaths of birds
చైనా మాంజా.. పక్షుల పాలిట పంజా

By

Published : Jan 15, 2021, 8:03 AM IST

పతంగులు ఎగురవేయడానికి ఉపయోగిస్తున్న చైనా మాంజా దారం వల్ల పక్షులు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనిపై దృష్టి సారించిన అటవీ శాఖ అధికారులు అక్రమంగా అమ్మకాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నైలాన్ దారాలు, చైనా మాంజా వంటివి పోరపాటున పక్షులకు తాకితే వాటికి రెక్కలు, మెడకు గాయాలై చనిపోతున్నాయి. చెట్లకు చిక్కుకోని తెగిపోయిన పతంగుల దారాలకు వాటిపై వాలిన పక్షుల కాళ్లకు చిక్కుకుని పోతున్నాయి.

చైనా మాంజా.. పక్షుల పాలిట పంజా

ఈ రాకాసి దారాల వల్ల మనుషులకు సైతం తీవ్ర గాయాలైన ఘటనలు అనేకం ఉన్నాయి. చైనా మాంజా వినియోగం, దాని వల్ల జరిగే ప్రమాదాలు తగ్గకపోవడంతో ఈసారి అటవీ శాఖ, పోలీసు శాఖలు అప్రమత్తం అయ్యాయి. అమ్మకాలను అరికడుతూనే.. అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details