సంగారెడ్డి నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు పర్యటించారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందుతాయని మంత్రి స్పష్టం చేశారు.
కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు - minister harish rao visit to sangareddy
పేదల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
సంగారెడ్డిలో కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు
పేదల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చాక.. పేదలకు భరోసా వచ్చిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ తప్పుదోవ పట్టిస్తోంది: తెలంగాణ