సంగారెడ్డి జిల్లా పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ఓఎస్డీ రామయ్య ఆకస్మిక పర్యటన చేసి పరిశీలించారు. స్థానిక అధికారులను ధరణి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే నమోదు చేసే సమయంలో వచ్చే సమస్యలను ఎలా అధిగమిస్తున్నారని అడిగి క్షుణ్నంగా వివరాలు సేకరించారు.
పటాన్చెరులో సీఎం ఓఎస్డీ ఆకస్మిక పర్యటన.. ధరణి పనితీరు పరిశీలన - పటాన్చెరులో పర్యటించిన తెలంగాణ సీఎం ఓఎస్డీ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ఓఎస్డీ రామయ్య ఆకస్మికంగా పరిశీలించారు. ధరణి పోర్టల్ పనితీరు గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పటాన్చెరులో సీఎం ఓఎస్డీ ఆకస్మిక పర్యటన.. ధరణి పనితీరు పరిశీలన
రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ సౌలభ్యంగా ఉందా, సేవలు పొందే క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అని భూ విక్రేతలు, కొనుగోలు దారులను అడిగారు. ఓఎస్డీ రామయ్య అడిగిన వివరాలను అదనపు పాలనాధికారి వీరారెడ్డి ఆర్డీవో నగేష్ నివేదిక రూపంలో అందించారు.
ఇదీ చూడండి:తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్