సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్మెంట్ ప్రకటనపై ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాల నిరసన - సంగారెడ్డిలో ఉద్యోగ సంఘాల ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం అతితక్కువ ఫిట్మెంట్ పెంపును నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు.
సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాల నిరసన
ప్రభుత్వ ప్రకటనను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా ఫిట్మెంట్ను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఇదీ చూడండి:ఫిట్మెంట్ పేరుతో ఊరించి.. ఉసూరుమనిపించారు: సంజయ్