ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఐక్య ఉపాద్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఎం హామీలు మాటల వరకే పరిమితమవుతున్నాయి తప్ప అమలుకు నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో లేనంతగా ఉపాధ్యాయులకు వేతనాలు ఇస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి... వేతనాల చెల్లింపులలో 17వ స్థానములో ఉన్న విషయం గుర్తించాలన్నారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్లో ఉపాధ్యాయ గర్జన నిర్వహిస్తున్నట్లు తలిపారు.
సంగారెడ్డి కలెక్టరేట్ ముందు జాక్టో ధర్నా - teachers protest
ఉపాద్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట జాక్టో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
సంగారెడ్డి కలెక్టరేట్ ముందు జాక్టో ధర్నా