సంగారెడ్డి జిల్లాలో పీఆర్సీ నివేదికకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
'టీచర్ల సమస్యలను తీర్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా..?' - ఉపాధ్యాయుల జీతాలు, బదిలీలు
తెరాస ప్రభుత్వం ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తోందని పీఆర్టీయూటీఎస్ మండిపడింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పీఆర్సీ నివేదికకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు.

'టీచర్ల సమస్యలను తీర్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా..?'
ఉపాధ్యాయుల జీతాలు, బదిలీల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తూ.. ఫిట్మెంట్ను 45శాతం పెంచాలని నాయకులు డిమాండ్ చేశారు. టీచర్ల సమస్యలను తీర్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటూ ప్రశ్నించారు. డిమాండ్లను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.