సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూరు ప్రాథమికోన్నత పాఠశాలలో విజయ్ కుమార్ అనే వ్యక్తి ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. విద్యార్థులు చిన్నపాటి అల్లరి చేశారని ఐదు మందిని బెత్తంతో చితకబాదాడు. విద్యార్థుల వారి తల్లిదండ్రులకు చూపించటం వల్ల మధ్యవర్తుల ద్వారా విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. మండల విద్యాశాఖ అధికారులకు ఈ విషయం తెలిసిన సదురు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకునేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.
విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు - teacher beating students in Sanga reddy district
ఉపాధ్యాయులు విద్యార్థులను బెత్తంతో దండించకూడదని ఎన్నిసార్లు చెప్పినా.. వారి విధానంలో మార్పు రావడం లేదు. సంగారెడ్డి జిల్లా నల్తూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులను ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు