4వ తరగతి విద్యార్థిని హోంవర్క్ చేయలేదనే కారణంతో ఉపాధ్యాయుడు ఫణి తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని విజయనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. బడికి వెళ్లిన చిన్నారిని హోంవర్క్ సరిగ్గా చేయలేదని ఉపాధ్యాయుడు వీపు, చెంపలపై తీవ్రంగా కొట్టాడు. పాప భయంతో పారిపోయి ఏడుస్తూ ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. చిన్నారిని కమిలిపోయేలా కొట్టిన ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సంబంధిత ఉపాధ్యాయున్ని వివరణ కోరగా... పొరపాటున గట్టిగా తగిలిందంటూ క్షమాపణలు కోరాడు.
హోం వర్క్ చేయలేదని చిన్నారిని హింసించిన గురువు - గురువే
హోం వర్క్ సరిగ్గా చేయలేదని ఓ నాలుగో తరగతి విద్యార్థినిని ఉపాధ్యాయుడు వీపు కమిలిపోయేలా కొట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
ఇంటి పనులు చేయిస్తున్న టీచర్..
Last Updated : Sep 25, 2019, 5:19 PM IST