సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మారుతి అనాథాశ్రమం బాలిక అత్యాచారం కేసులో ప్రభుత్వం అన్ని విషయాలను బయటపెట్టాలని తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోత్స్న డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు డీఎస్పీ రాజేశ్వర రావుకు తెదేపా జిల్లా యువత అధ్యక్షులు ఎడ్ల రమేశ్ ఆధ్వర్యంలో తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న వినతిపత్రం ఇచ్చారు.
'ప్రభుత్వం అన్ని విషయాలను బయటపెట్టాలి' - తెతెదేపా మెమోరండం
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మారుతి అనాథాశ్రమం బాలిక అత్యాచారం కేసులో ప్రభుత్వం అన్ని విషయాలను బయటపెట్టాలని తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోత్స్న డిమాండ్ చేశారు.
'ప్రభుత్వం అన్ని విషయాలను బయటపెట్టాలి'
సీడబ్ల్యూసీ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని ఆమె కోరారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉన్నప్పటికీ దీనిపై ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమన్నారు. వెంటనే అధికారికంగా దీనిపై ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ఉన్న ఆశ్రమాల్లో ఇలాంటి అఘాయిత్యాలు జరిగితే ఇక రాష్ట్రంలో ఉన్న అనాథ ఆశ్రమాలు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.