తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రులు సమక్షంలో మార్కెట్ కమిటీ పాలక మండలి ఎన్నిక - పటాన్‌చెరు మార్కెట్‌ తాజా సమాచారం

పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు, ఆత్మా కమిటీ సభ్యులు, అధ్యక్షుల ప్రమాణ స్వీకారం మంత్రుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, తదితరులు పాల్గొన్నారు.

Sworn the agriculture members before ministers at patancheru
మంత్రులు సమక్షంలో మార్కెట్ కమిటీ పాలక మండలి ఎన్నిక

By

Published : May 22, 2020, 2:35 PM IST

Updated : May 22, 2020, 6:38 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు, ఆత్మా కమిటీ సభ్యుల, అధ్యక్షుల ప్రమాణ స్వీకారం మంత్రుల సమక్షంలో నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్‌లో దుకాణాల సముదాయంను మంత్రులు ప్రారంభించారు. రైతులకు మేలు జరిగేందుకు కొత్త వ్యవసాయ విధానం అవసరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే విప్లవాత్మక మార్పులు అమలు చేయాలన్నారు. పదవి రావడం గొప్ప కాదు. పదవిని ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్వహించడం గొప్ప అని హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు.

ఏం చేస్తే అధిక శాతం ప్రజలకు

వ్యవస్థలో వస్తున్న నూతన మార్పులను పరిశీలించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. దేశంలోనే అత్యుత్తమ మార్కెట్‌గా పటాన్‌చెరు మార్కెట్‌ను మార్చాలని చెప్పారు. హైదరాబాద్‌కు నలుదిక్కులా సమీకృత మార్కెట్లు అభివృద్ధి చేస్తామన్నారు. జిన్నారం, గుమ్మడిదలకు గోదాములు మంజూరు చేశామన్నారు. ఏం చేస్తే అధిక శాతం ప్రజలకు ఉపాధి లభిస్తుందో సీఎం కేసీఆర్​ ఆలోచించారని అన్నారు. దానికి అనుగుణంగా సమగ్ర వ్యవసాయ విధానం, నియంత్రిత పద్దతుల్లో పంటలు వేయాలన్నారని పేర్కొన్నారు. మన రాష్ట్రానికి ఎన్ని కూరగాయాలు అవసరం, ఎన్ని బియ్యం అవసరం ఇలా అనేక అంశాలు సర్వే చేయించామన్నారు. మన అవసరాలకు పోనూ ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే విధంగా పంటలు వేయాలన్నారు. రైతును రాజును చేయాలని సీఎం చెప్పారని అన్నారు.

మంత్రులు సమక్షంలో మార్కెట్ కమిటీ పాలక మండలి ఎన్నిక

ఇదీ చూడండి :మృతదేహాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

Last Updated : May 22, 2020, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details