రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. జహీరాబాద్‌లో ఏప్రిల్ 1న నిర్వహించనున్న రాహుల్‌గాంధీ సభ ఏర్పాట్లను మాజీమంత్రి గీతారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. తెరాసకు 16 సీట్లిస్తే వాటిని తీసికెళ్లి భాజపాలో కలుపుతారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓట్లేసి రాహుల్‌గాంధీకి మద్దతు తెలిపాలని కోరారు. యువత, విద్యావంతులు కాంగ్రెస్ వైపే ఉన్నారని.. దానికి జీవన్‌రెడ్డి విజయమే నిదర్శనమని మాజీమంత్రి గీతారెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయాలని కోరారు.
'తెరాసకు 16 సీట్లిస్తే వాటిని భాజపాలో కలుపుతారు' - RAHUL TOUR IN TELANGANA
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఓటేసి మద్దతు తెలిపాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలను కోరారు. తెరాసకు 16 సీట్లిస్తే వాటిని తీసుకెళ్లి భాజపాలో కలుపుతారని ఆరోపించారు.
'తెరాసకు 16 సీట్లిస్తే వాటిని భాజపాలో కలుపుతారు'