తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యగ్రహణం ప్రభావం.. నిటారుగా నిలిచిన రోకలి - సంగారెడ్డి జిల్లా వార్తలు

గ్రహణంపై ప్రజల్లో ఎన్నో విశ్వాసాలు ఉంటాయి. అయితే సంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ తాంబాలంలో నీళ్లు పోసి రోకలిని నిలబెట్టింది. తాను చిన్నప్పుడు వాళ్ల అమ్మ ఆ విధంగా చేసిందని... ఇప్పుడు ఓసారి ప్రయత్నించామని ఆమె తెలిపారు.

ROKALI
ROKALI

By

Published : Jun 21, 2020, 2:09 PM IST

Updated : Jun 21, 2020, 4:18 PM IST

సూర్యగ్రహణం ప్రభావం.. నిటారుగా నిలిచిన రోకలి

గ్రహణం రోజు తాంబాలంలో రోకలి నిలబడతాయన్నది ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసంతోనే సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఓ మహిళ తన ఇంటిముందు తాంబాలంలో నీళ్లు పోసి రోకలి నిటారుగా నిలిపింది. గ్రహణం పట్టే సమయానికి ఆ రోకలి కదలకుండా తాంబూలాన్ని అంటిపెట్టుకొని నిటారుగా నిలిచిపోయింది.

గ్రహణం రోజు చిన్నప్పుడు మా అమ్మ వాకిట్లో తాంబూలంలో నీళ్లు పోసి నిలువుగా నిలిపింది. ఇవాళ మేము చేశాం అది నిటారుగా నిలుచొని ఉంది. గ్రహణం పట్టక ముందు చేస్తే కింద పడిపోయింది. గ్రహణం పట్టిన తర్వాత నిటారుగా నిలిచి పోయింది. అది చూసి మేము ఆశ్చర్యపోయాం.

Last Updated : Jun 21, 2020, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details