తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్​ ఎదుట చెరుకు రైతుల ఆందోళన.. ఎందుకంటే? - సంగారెడ్డి కలెక్టరేట్​ ఎదుట చెరుకు రైతుల ఆందోళన వార్తలు

సంగారెడ్డి కలెక్టరేట్​ ఎదుట పలువురు రైతులు ఆందోళన చేపట్టారు. చెరుకు బిల్లు బకాయిలు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్న ట్రైడెంట్​ చక్కెర కర్మాగార యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్​లో వినతి పత్రాన్ని అందజేశారు.

Sugarcane farmers' concern in front of the Collectorate in sangareddy
కలెక్టరేట్​ ఎదుట చెరుకు రైతుల ఆందోళన.. ఎందుకంటే?

By

Published : Oct 23, 2020, 5:49 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ వద్ద పలువురు రైతులు ఆందోళనకు దిగారు. జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) ట్రైడెంట్ చక్కెర కర్మాగార యాజమాన్యం తమకు చెరుకు బిల్లు బకాయిలు చెల్లించాలంటూ ఆరోపించారు. ఈ మేరకు కలెక్టరేట్​లో తమ ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు.

చెరుకు తరలించి సంవత్సరం గడుస్తున్నా.. ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పండించిన పంటకు డబ్బులు ఇవ్వకుండా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్​ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రైతులకు నచ్చజెప్పడం వల్ల ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి.. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వండి: ఎంపీ అర్వింద్

ABOUT THE AUTHOR

...view details