తెలంగాణ

telangana

ETV Bharat / state

అర కిలోమీటర్​ నడిస్తేనే కడుపు నిండుతుంది.. - సంగారెడ్డి జిల్లా వార్తలు

ప్రతిరోజూ మూడు కిలోమీటర్లు నడిస్తేనే వాళ్ల కడుపు నిండుతుంది. అల్పాహారమైనా, భోజనమైనా కాళ్లకు పనిచెప్పాల్సిందే. లేదంటే ఆ పూట పస్తులే. ప్రభుత్వ గిరిజన బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ఇదో నిత్యకృత్యం.

walking for food daily
అర కిలోమీటర్​ నడిస్తేనే కడుపు నిండుతుంది

By

Published : Mar 4, 2020, 5:34 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ గిరిజన బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు భోజనం చేయాలంటే నిత్యం అర కిలోమీటర్ నడవాల్సిన దుస్థితి నెలకొంది. పట్టణ కేంద్రంలో ఉన్న ఈ పాఠశాలకు సొంత భవనం లేదు. ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకాలం పట్టణ శివారులోని ఒక ప్రైవేటు లేఅవుట్ లో అద్దె భవనంలో కొనసాగింది. ఇటీవలే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను పురాతన భవనానికి మార్చారు. ఈ భవనంలో తరగతులు నిర్వహిస్తూ.. అర కిలో మీటర్ దూరంలో ఉన్న అద్దె భవనంలో భోజనాల ఏర్పాట్లు చేశారు.

పట్టణంలోని భవనంలో ఉంటున్న విద్యార్థులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజన సమయంలో శివారులోని భవనానికి వెళ్లాలి. ప్రతిపూట ఇలా అరకిలోమీటర్ నడవాలి. రాత్రిపూట ఇలా నగర శివారుకు వెళ్లిరావాలంటే భయమేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అర కిలోమీటర్​ నడిస్తేనే కడుపు నిండుతుంది

ఇవీ చూడండి:రహేజా ఐటీ పార్క్‌లో.. ఉద్యోగికి కరోనా లక్షణాలు

ABOUT THE AUTHOR

...view details