బుధవారం నుంచి 6,7,8 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన తరగతులు నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరువు జిల్లా పరిషత్ పాఠశాల ప్రారంభమైంది. కొవిడ్ నిబంధనల ప్రకారం తరగతులు నిర్వహించడంతో గదులు సరిపోక విద్యార్థులను వరండాలోనే కూర్చోబెట్టారు.
'తరగతుల నిర్వహణకు గదులు సరిపోవడం లేదు'
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి 6,7,8 తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహించాలని ఆదేశాలివ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులకు పాఠాలు బోధించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరువు ప్రభుత్వ పాఠశాలలో గదులు సరిపోకపోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థులను వరండాలోనే కూర్చోబెట్టారు.
'తరగతుల నిర్వహణకు గదులు సరిపోవడం లేదు'
నిన్నటివరకు 9,10 తరగతుల విద్యార్థులతోనే గదులు నిండిపోయాయి. ఈ రోజు అదనంగా 6,7,8 తరగతుల విద్యార్థులు రావడంతో సమస్య మొదలైంది. సమస్య పరిష్కారం కోసం షిఫ్ట్ విధానంలో బోధన నిర్వహించాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపామని ప్రాధానోపాధ్యాయురాలు సీతామహాలక్ష్మి తెలిపారు.
ఇదీ చూడండి:మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించిన సీఎం