ఆర్టీసీ కార్మికుల సమ్మెకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. కార్మికుల సమ్మె 22వ రోజుకి చేరుకున్నందున సంగారెడ్డి ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని.. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సమ్మెకు విద్యార్థి సంఘాల సంఘీభావ ర్యాలీ - సంగారెడ్డి జిల్లాకేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె
సంగారెడ్డి జిల్లాకేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు విద్యార్థి సంఘాలు సంఘీభావ ర్యాలీ నిర్వహించాయి. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.
ఆర్టీసీ సమ్మెకు విద్యార్థి సంఘాల సంఘీభావ ర్యాలీ
ఇవీ చూడండి: డీసీఎంను ఢీకొట్టిన ఆటో... ఇద్దరు మృతి
Last Updated : Oct 26, 2019, 9:31 PM IST