తెలంగాణ

telangana

ETV Bharat / state

గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య - కొండాపూర్​లో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి వార్తలు

కొండాపూర్​లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Student suicide in Gurukul school
గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

By

Published : Dec 16, 2019, 10:38 AM IST

సంగారెడ్డి జిల్లా కొండాపూర్​లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న రత్నం(16) అనే విద్యార్థి పాఠశాల ఆవరణలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ శివలింగం ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.


పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

ఇవీ చూడండి:నేటితో 'నిర్భయ' ఘటనకు ఏడేళ్లు.. న్యాయం సంగతేంటి?



For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details