తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డి జిల్లాలో ఛైర్మన్​ పీఠానికి గట్టిపోటీ

సంగారెడ్డి జిల్లాలో బల్దియా సమరంలో  తన అధిపత్యాన్ని ప్రదర్శించిన తెరాస.. ఛైర్మన్ల పీఠం వద్ద కొంత గడ్డు పరిస్థితి ఎదుర్కోంటోంది. జిల్లాలో ఎన్నికలు జరిగిన ఎడు పురపాలికల్లో ఆరింట్లో మెజార్టీ స్థానాలు సాధించగా.. నారాయణఖేడ్​లో రెండో స్థానంలో నిలిచింది. ఇక బొల్లారంలో సొంత గూటిలోనే తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. ఈ రెండింటిని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని గులాబీ నేతలు ప్రయత్నిస్తుంటే.. తమ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్ నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు.

సంగారెడ్డి జిల్లాలో ఛైర్మన్​ పీఠానికి గట్టిపోటీ
సంగారెడ్డి జిల్లాలో ఛైర్మన్​ పీఠానికి గట్టిపోటీ

By

Published : Jan 27, 2020, 9:31 AM IST


సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పురపాలక సంఘం పరిధిలో పదిహేను వార్డులు ఉండగా.. ఎనిమిది కాంగ్రెస్.. ఏడు తెరాస కైవసం చేసుకున్నాయి. ఇక్కడి ఛైర్మన్ పీఠం సొంతం చేసుకోవడానికి.. తెరాస, కాంగ్రెస్ వ్యూహ, ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ నియోజకవర్గంలో.. రెండు పార్టీలు బలంగా ఉన్నందన ఛైర్మన్ పదవి సొంతం చేసుకోవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తెరాసకు చెందిన స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో పాటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్, ఫరూకుద్దీన్, భూపాల్ రెడ్డిలు ఎక్స్ ఆఫీసీయో సభ్యులు ఇక్కడే నమోదు చేయించుకున్నారు. ఫలితంగా వీరి బలం 12కు చేరుకుంది. కాంగ్రెస్ నాయకులు కూడా తమ ఎమ్మెల్సీలను ఇక్కడే ఎక్స్ ఆఫీసీయో సభ్యులు నమోదు చేయించారు. షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డిలు ఇక్కడే నమోదు చేసుకోగా.. కాంగ్రెస్ బలం పదికి చేరుకుంది.

సంగారెడ్డి జిల్లాలో ఛైర్మన్​ పీఠానికి గట్టిపోటీ

రెండు వర్గాలుగా చీలిక:

బొల్లారం పురపాలక సంఘం పరిధిలో 22వార్డులకు తెరాస 17సొంతం చేసుకుంది. ఐతే ఇక్కడ ఛైర్మన్ పీఠం కోసం అధికార పార్టీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. స్థానిక ఎమ్మెల్యే చంద్రారెడ్డి పేరును ఛైర్మన్ ప్రతిపాదించగా.. స్థానికంగా మరో బలమైన నేత బాల్ రెడ్డి ఆ పదవి తన భార్యకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కౌన్సిలర్లు చంద్రారెడ్డి వర్గం, బాల్ రెడ్డివర్గంగా విడిపోయారు. చంద్రారెడ్డికి ఏడుగురి మద్దతు ఉండగా.. బాల్ రెడ్డికి మద్దతుగా పది మంది కౌన్సిలర్లు ఉన్నారు. మూడు స్థానాల్లో గెలిచిన భాజపా, రెండు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతు కూడా బాల్ రెడ్డి కూడగట్టాడని స్థానికంగా ప్రచారం సాగుతోంది. విప్ జారీ చేసిన తెరాస.. కౌన్సిలర్లు క్యాంపుల్లో ఉండటం వల్ల ఆ పత్రాలను వారి ఇళ్లకు అతికించింది. మరోవైపు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన ఎక్స్ ఆఫీసియో ఓటును ఇక్కడే నమోదు చేసుకున్నారు. ఈ పరిణామాలతో రాజకీయం రసవత్తరంగా మారింది.

ఇవీ చూడండి:కరీంనగర్ కార్పొరేషన్​ పరిధిలో ఓట్ల లెక్కింపు ప్రారంభం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details