తెలంగాణ

telangana

By

Published : Dec 9, 2019, 3:23 PM IST

ETV Bharat / state

ప్రభుత్వానికి పట్టని 'ఉల్లి కష్టాలు'...

రెండు వారాల నుంచి ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోవటం వల్ల సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.150 నుంచి 200 వరకు పలుకుతోంది.

strike-under-the-aegis-of-cpm-due-to-rising-onion-prices
ప్రభుత్వానికి పట్టని 'ఉల్లి కష్టాలు'...

ఉల్లి ధరలను నియంత్రించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఉల్లిగడ్డల ధరలు రోజురోజుకు పెరుగుతున్నా.. వాటిని నియంత్రించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. దీని వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.

ధరలను నియంత్రించి.. వాటిని రేషన్ దుకాణాల ద్వారా అందించాలని కోరారు. కిలో ఉల్లి 150 నుంచి 200 వరకు ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి పట్టని 'ఉల్లి కష్టాలు'...

ఇవీచూడండి: కాళేశ్వరం నీళ్లతో... అమరవీరులకు 'జల నీరాజనం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details